News April 3, 2025

13న ఓటీటీలోకి ‘కింగ్‌స్టన్’

image

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘కింగ్‌స్టన్’ మూవీ ఈ నెల 13న జీ5 ఓటీటీలోకి రానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు జీ తమిళ్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటించారు. మార్చి 7న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

Similar News

News April 10, 2025

రేషన్‌లో రాగులు.. జూన్ నుంచి పంపిణీ

image

AP: వచ్చే జూన్ నుంచి రేషన్ షాపుల్లో రాగులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా అందించనుంది. ప్రతి నెలా 20 కేజీల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీల రాగులు కావాలంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారు. ఇందుకు ఏటా 25వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని అంచనా. ఆ మేరకు రాగుల సేకరణకు టెండర్ జారీ చేసింది.

News April 10, 2025

‘రామాయణం’లో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్

image

బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణం’ చిత్రంలో హనుమంతుడిగా నటిస్తున్నట్లు సన్నీ డియోల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అవును నేను హనుమంతుడి పాత్ర చేస్తున్నా. నటులుగా మేము సవాళ్లతో కూడిన పాత్రలను ఇష్టపడతాం. ఎందుకంటే అది సరదాగా ఉంటుంది. ప్రజలు మెచ్చేలా నేను ఆ పాత్రలో లీనమైపోతా. నేను ఇంకా షూటింగ్‌లో పాల్గొనలేదు. ఇది ఆల్ టైమ్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అని ఆయన తెలిపారు.

News April 10, 2025

ALERT: రెండ్రోజుల పాటు వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. గంటకు 50 కి.మీ వేగం వరకూ ఈదురుగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

error: Content is protected !!