News April 3, 2025
MBNR: ‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి’

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, దీనిపై గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అమల్లోకి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ బిల్లుకు తాము అసెంబ్లీలో మద్దతు ఇచ్చామని, రేపు పార్లమెంట్‌కు వస్తే, అక్కడ కూడా మద్దతు ఇస్తామన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.
Similar News
News April 10, 2025
దర్మవరం: ‘పోలీస్ యూనిఫాం అందరికీ సమానమే’

జగన్ పోలీసు యూనిఫార్మ్‌ను ఎందుకు ద్వేషిస్తారని మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు. పోలీసులు లేదా ఏదైనా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీ పట్ల జగన్‌కు జన్యుపరమైన అసహ్యం ఉంది. ఇది అతని పేరుమోసిన తాత దివంగత శ్రీ రాజారెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిందని విమర్శలు గుప్పించారు. పోలీసు యూనిఫాం అనేది చట్టం దృష్టిలో అందరికీ సమానత్వం అనే రాజ్యాంగ ధర్మాన్ని హైలైట్ చేసే లా అండ్ ఆర్డర్ నడక చిహ్నం అని అన్నారు.
News April 10, 2025
కొత్తగూడెం: ‘200 ఎకరాల వ్యవసాయ భూమి కబ్జా’

కొత్తగూడెం(D) టేకులపల్లి(M) గంగారం రెవెన్యూ పరిధి సంపత్ నగర్‌లో కొందరు 200 ఎకరాల సాగు భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేయాలని చూస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఓ మాజీ రౌడీ షీటర్, కేటీపీఎస్‌లో పని చేసే ఒక ఉద్యోగి, స్థానికుడు ఇదంతా నడిపిస్తున్నారంటున్నారు. గుడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాన్ జ్యుడీషరీ స్టాంప్ పేపర్ సృష్టించారని, ఈ ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
News April 10, 2025
వేగంగా సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు

TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పనులకు ఇబ్బంది తలెత్తకుండా 115రోజుల పాటు ఐదు ఫ్లాట్ ఫాంలను తాత్కాలికంగా మూసి వేయనున్నట్లు ద.మధ్య రైల్వే తెలిపింది. అదేవిధంగా ఈ నెల 15నుంచి స్టేషన్ నుంచి వెళ్లే 120 రైళ్లను దశలవారీగా చర్లపల్లి టెర్మినల్, నాంపల్లి, కాచిగూడ మీదుగా దారి మళ్లించనున్నారు. పునర్నిర్మాణ పనుల రీత్యా 6నెలల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది.