News April 3, 2025

మహబూబ్‌నగర్‌లో SFI, BRSV నాయకుల నిరసన 

image

హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం అక్కడ విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట ఎస్ఎఫ్ఐ, బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు రాము మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల జోలికి వస్తే సహించేది లేదన్నారు.

Similar News

News December 28, 2025

జమ్మూలో 30 మందికి పైగా ఉగ్రవాదులు!

image

జమ్మూ ప్రాంతంలో 30 మందికిపైగా పాకిస్థానీ ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. కొండలు, అడవులు, లోయల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలను గమనించేందుకు డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను ఉపయోగిస్తున్నారు. తీవ్ర చలిని తట్టుకుని.. ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచేందుకు పర్వత ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేశారు.

News December 28, 2025

వరంగల్: రేపటి నుంచే ‘యూరియా యాప్’ అమలు

image

వరంగల్ జిల్లాలో యూరియా పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రేపటి నుంచి జిల్లావ్యాప్తంగా యూరియా యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉన్న రైతులు గూగుల్ ప్లే స్టోర్‌లో ‘Fertilizer Booking App’ అని టైప్ చేసి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యూరియా సరఫరాలో జాప్యాన్ని నివారించొచ్చని ఆమె పేర్కొన్నారు.

News December 28, 2025

ప్రముఖ ఫ్రెంచ్ నటి కన్నుమూత

image

ప్రముఖ ఫ్రెంచ్ నటి బ్రిగిట్టే బార్డోట్(91) మరణించారు. నటి, మోడల్‌, సింగర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. సదరన్ ఫ్రాన్స్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతనెల అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె వృద్ధాప్య సమస్యలతోనే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.