News April 3, 2025
శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన డీఎంఅండ్‌హెచ్ఓ

శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపై గురువారం ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ బాలమురళీకృష్ణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బీవీవీ రమణమూర్తి గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ మెడికల్ లీవ్‌లో ఉంది. ఆమె తిరిగి విధుల్లో చేరేందుకు లంచం అడగడంతో ఏసీబీని ఆమె ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 10, 2025
నరసన్నపేట : ముగ్గుల పోటీల్లో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ

ముగ్గుల పోటీలలో నరసన్నపేటకు చెందిన మహిళ రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఆంధ్రా అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆన్‌లైన్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో సునీత మొదటి బహుమతిని గెలుచుకున్నారు. లక్షల రూపాయలు గెలుచుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
News April 10, 2025
మెళియాపుట్టి: విషం తాగి వృద్ధుడు ఆత్మహత్య

మండలంలోని జర్రిభద్ర గ్రామానికి చెందిన దుంపల సూర్యనారాయణ (82) మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వైద్యం నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్లు బుధవారం ఎస్సై పి.రమేశ్ బాబు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 10, 2025
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డా.స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీసర్వే పౌర సేవలపై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.