News April 3, 2025

సన్న బియ్యం పంపిణీ చేసిన నల్గొండ కలెక్టర్

image

దిండి(గుండ్లపల్లి) మండలం కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఏఎస్పీ మౌనిక ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, కొత్త రేషన్ కార్డుల కోసం ఈ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 10, 2025

మిర్యాలగూడ: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

image

మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి పంచాయతీ కార్యదర్శి పెసర యాదగిరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలపై జిల్లా అధికారులు విచారణ చేశారు. ఓ వ్యక్తికి చెందిన నివాస గృహాల మ్యుటేషన్ విషయంలో రిజిస్టర్‌లో మార్పులు చేశారని రుజువు కావడంతో కలెక్టర్ సస్పెండ్ చేశారు.

News April 10, 2025

NLG: ఐదు రోజులే గడువు: ఇలా త్రిపాఠి

image

రాజీవ్ యువ వికాస పథకానికి ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను, గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో టామ్ టామ్ నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబానికి ఐదేళ్ల కాలంలో ఒకే సంక్షేమ పథకానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అన్నారు.

News April 9, 2025

చిట్యాల: 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నర్రా రాఘవరెడ్డి

image

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవ రెడ్డి 1967, 1978, 1983, 1984, 1989, 1994 సంవత్సరాలలో నకిరేకల్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కమలమ్మ రామ్ రెడ్డి దంపతులకు జన్మించిన రాఘవరెడ్డి ఎన్నో ఉద్యమాలలో ప్రజా సమస్యలపై కీలకంగా పని చేశారు. ప్రతిపక్ష నేతగా టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపై తీవ్రంగా విరుచుకు పడేవారు. నేడు రాఘవరెడ్డి వర్ధంతి.

error: Content is protected !!