News April 3, 2025

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ: ఏలూరు కలెక్టర్

image

ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పట్ల ప్రేమా ఆప్యాయతలను పంచాలి అని కలెక్టర్వెట్రి సెల్వి అన్నారు. ఏలూరులో గురువారం ఓ జరిగిన కార్యక్రమంలో 500 మంది పిల్లలకు రూ.75 లక్షల విలువ చేసే వివిధ ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా విద్యశాఖ, సమగ్రశిక్ష ఏలూరు జిల్లా ఆధ్యర్యంలో వీటిని అందజేశారు.

Similar News

News April 10, 2025

వనపర్తి: కలెక్టరేట్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

image

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి ఐడీఓసీ సమావేశం మందిరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి ఇందిర తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లాలోని ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, కుల సంఘాల పెద్దలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

News April 10, 2025

వరంగల్: 6 వేల ఉద్యోగాలు.. దాదాపు 50 కంపెనీలు!

image

వరంగల్ మహా నగరంలో మంత్రి కొండా సురేఖ చొరవతో శుక్రవారం మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని MK నాయుడు కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ జాబ్ మేళాలో సుమారు 6 వేల ఉద్యోగాల భర్తీకి 50కి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 10, 2025

డాక్టర్ ప్రభావతి వ్యాఖ్యలపై RRR స్పందన

image

కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి తనకేమీ గుర్తులేదని చెప్పడంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ చదివిన వైద్యురాలు గాయాలపై అవగాహన లేదనడం ఆశ్చర్యకరమని అన్నారు. ఆమెకు గతం గుర్తొచ్చే ఏర్పాట్లు జరుగుతాయని ఆశిస్తున్నానన్నారు. కొన్ని సినిమాల్లోలా, ఆమెకి మళ్లీ జ్ఞాపకశక్తి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

error: Content is protected !!