News April 3, 2025
ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలి: మంత్రి జనర్సింహ

అందోల్: ప్రతి పేదవాడి వరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ గంజ్ ప్రాంతంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనంతరం మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామన్నారు.
Similar News
News April 14, 2025
SRHకు కీలక ప్లేయర్ దూరం

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలక స్పిన్నర్ అయిన జంపా గాయంతో జట్టు నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జట్టు యాజమాన్యం కర్ణాటక బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్‌ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. ఇక రుతురాజ్ స్థానంలో సీఎస్కే ఆయుష్ మాత్రేను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మార్పుల్ని ఐపీఎల్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ధ్రువీకరించింది.
News April 14, 2025
CSK ఓపెనర్‌గా గుంటూరు కుర్రోడు

ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై తరఫున ఈరోజు ఆరంగేట్రం చేసిన గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌గా వచ్చి 19 బంతుల్లో 27(6 ఫోర్లు) పరుగులు చేశారు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో పూరన్ చేతికి చిక్కి అవుటయ్యారు. రూ.30లక్షలకు రషీద్‌ను చెన్నై సొంతంగా చేసుకోగా.. ఈ సీజన్‌లో అతనికిదే మొదటి మ్యాచ్.
News April 14, 2025
జుట్టుకు హెన్నా పెడుతున్నారా?

తెల్ల జుట్టు ఉన్నవారు సహజమైన ఎరుపు రంగు కోసం హెన్నా వాడుతుంటారు. కానీ మరీ ఎక్కువగా వాడితే అది జుట్టుకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంటుందని శిరోజ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘హెన్నాను మరీ ఎక్కువ వాడటం వల్ల శిరోజాల్లోని సహజమైన మృదుత్వం పోయి గరుకుగా మారిపోతుంది. జుట్టు విరిగిపోతుంటుంది. సున్నితమైన చర్మం కలిగినవారిలో దురదలూ రావొచ్చు. హెన్నా సహజమైనదే అయినా పరిమితంగా వాడటం మంచిది’ అని సూచిస్తున్నారు.