News April 3, 2025
ఈ తీర్పు రేవంత్ చర్యలకు చెంపపెట్టు: హరీశ్

TG: గచ్చిబౌలి కంచ <<15980925>>భూములపై <<>>సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును BRS నేత హరీశ్‌రావు స్వాగతించారు. ‘ఈ తీర్పు CM రేవంత్ దుందుడుకు చర్యలకు చెంపపెట్టులాంటిది. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు కంచ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తానంటే చట్టం ఊరుకోదు. ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, సామాజికవేత్తల విజయం. వారికి అభినందనలు’ అని Xలో రాసుకొచ్చారు.
Similar News
News April 10, 2025
నేరుగా తిహార్ జైలుకు తహవూర్ రాణా!

26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా(64)ను అధికారులు US నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొస్తున్నారు. మధ్యాహ్నంలోపు అతడు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడికి రాగానే రాణాను NIA అధికారికంగా అరెస్ట్ చేయనుంది. అనంతరం అతడిని తిహార్ జైలులోని హైసెక్యూరిటీ వార్డులో ఉంచనున్నారు. 2008 NOV 26న ముంబైలోని తాజ్ హోటల్‌లో 10 మంది పాకిస్థానీ టెర్రరిస్టుల నరమేధం వెనుక రాణాదే మాస్టర్ మైండ్.
News April 10, 2025
YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. TDP సంచలన నిర్ణయం

AP: YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన iTDP కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు TDP ప్రకటించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరింది. దీంతో గుంటూరు పోలీసులు కిరణ్‌పై కేసు ఫైల్ చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని పార్టీ స్పష్టం చేసింది. కాగా భారతిపై కామెంట్స్ చేయడంపై YCP తీవ్రంగా స్పందించింది. దీంతో కిరణ్ <<16049878>>క్షమాపణలు<<>> చెప్పాడు.
News April 10, 2025
అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పబ్లిక్ టాక్

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదలైంది. ఇప్పటికే USలో చూసినవారు తమ అభిప్రాయాన్ని SMలో పంచుకున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా మూవీ ఉందని, అజిత్ ఫ్యాన్స్‌కు పండగేనని కొందరు పేర్కొంటున్నారు. భారీ యాక్షన్ సీన్లు, ఇంటర్వెల్ సీన్ అజిత్ కెరీర్‌లోనే బెస్ట్ అని పోస్టులు చేస్తున్నారు. సెకండాఫ్ స్లోగా ఉందని, మ్యూజిక్ బాగుందని అంటున్నారు. కాసేపట్లో వే2న్యూస్ రివ్యూ.