News April 3, 2025
ఇది HCU విద్యార్థుల విజయం: KTR

TG: కంచ గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి KTR ధన్యవాదాలు తెలిపారు. ఇది అవిశ్రాంతంగా పోరాడిన HCU విద్యార్థుల విజయమని అభివర్ణించారు. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు, పర్యావరణ ప్రేమికులు, మీడియా, సోషల్ మీడియా మిత్రులకు థాంక్స్ చెప్పారు. మరోవైపు SC ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని BJP MP రఘునందన్‌రావు పేర్కొన్నారు.
Similar News
News April 10, 2025
లోకో పైలట్లకు నో బ్రేక్స్: రైల్వేశాఖ

డ్యూటీలో ఉండగా భోజనానికి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు లోకో పైలట్లకు విరామ సమయాన్ని కేటాయించాలన్న విజ్ఞప్తిని రైల్వే శాఖ తిరస్కరించింది. రైలు ప్రమాదాలు పెరుగుతుండడం, వాటిలో చాలా వరకు మానవ తప్పిదాలే కారణమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పైలట్ల క్యాబిన్లలో వాయిస్, వీడియో రికార్డింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకుంది. దీనివల్ల సిబ్బంది ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది.
News April 10, 2025
30 లక్షల మందికి రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

TG: పేదలకు సన్నబియ్యం న్యాయంగా అందేలా చూసే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలసౌధలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దొడ్డు బియ్యం పేదలకు చేరకపోవడం వల్లనే సన్నబియ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి MLA తమ నియోజకవర్గంలో పథకం అమలును పర్యవేక్షించాలని సూచించారు. త్వరలోనే 30 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు.
News April 10, 2025
ఊహించని ప్రమాదం.. 218 మంది మృతి

డొమినికన్ రిపబ్లిక్‌లో నైట్ క్లబ్ <<16049528>>పైకప్పు కూలిన<<>> ఘటనలో మృతుల సంఖ్య 218కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేవరకు సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. 150 మందికి పైగా ప్రాణాలతో కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా తమవారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనే వివరాలు ఇవ్వకపోవడంతో అధికారులపై మృతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.