News April 3, 2025
సిరిసిల్ల: పది పరీక్షలు ప్రశాంతం

సిరిసిల్ల జిల్లాలో ఒకేషనల్ పదవ తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని సిరిసిల్ల డీఈవో జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం జిల్లాలో 979 మంది విద్యార్థులకూ 977 మంది విద్యార్థులు హాజరయ్యారని స్పష్టం చేశారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం విద్యార్థుల హాజరు శాతం 99.80గా నమోదయిందని తెలిపారు.
Similar News
News April 10, 2025
నాగర్ కర్నూల్ డిపో నుంచి సళేశ్వరం క్షేత్రానికి ప్రత్యేక బస్సులు

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన సళేశ్వరం లింగమయ్య క్షేత్రానికి ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సులు నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
News April 10, 2025
నర్సీపట్నం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

గుల్లిపాడు- నర్సీపట్నం స్టేషన్ మధ్య ట్రైన్ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రెండు రోజుల క్రితమే జారిపడి మృతి చెంది ఉంటాడని ఎస్ఐ తెలిపారు. మృతుడు ఎవరు అనేది తెలియరాలేదని, మృతుడు ఎడమ చేయిపై జ్యోతి అనే పచ్చబొట్టు ఉందని ఎస్ఐ వివరించారు.
News April 10, 2025
కోఠిలో ఉచితంగా రూ.12 లక్షల ఆపరేషన్..!

పలు కారణాలతో చిన్నపిల్లలకు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంటున్నట్లు కోఠి ENT ఆసుపత్రి డాక్టర్ వీణ తెలిపారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా పిల్లలు వినికిడి లోపాన్ని అధిగమించే అవకాశం ఉందని, రూ.12 లక్షలు ఖర్చు చేసే దీనిని ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏటా కోఠి ఆసుపత్రిలో 60 నుంచి 70 సర్జరీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
– SHARE IT