News April 3, 2025
KNR: LRS రిబేట్ సదుపాయం గడువు పొడిగింపు: కలెక్టర్

అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మార్చి 31 నాటికి ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 10, 2025
కరీంనగర్: బావిలో పడి చిన్నారి మృతి

కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేటలో ట్రాక్టర్‌తో సహా ఓ చిన్నారి బావిలో పడి మృతి చెందిందని రూరల్ పోలీసులు తెలిపారు. ఆయన వివరాలు.. బొమ్మరెడ్డిపల్లెకు చెందిన జశ్విత(3) బంధువుల ఇంటికి బహుదూర్ ఖాన్ పేటకు వచ్చింది. వ్యవసాయ బావి వద్ద ట్రాక్టర్ సీటులో కూర్చుని తాళం తిప్పడంతో ట్రాక్టర్‌తో సహా బావిలో పడి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News April 10, 2025
కరీంనగర్: కూతురిని చంపి తల్లి సూసైడ్

పెద్దపలి టీచర్స్ కాలనీలో <<16048255>>కూతురిని <<>>చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో KNR జిల్లా రామడుగు(M) వెదిరకు చెందిన సాహితి(26)కి పెళ్లైంది. రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 10, 2025
కరీంనగర్ వాసులారా.. మీ పిల్లలపై ఓ కన్నేయండి

వేసవి కాలం వచ్చింది అంటే చాలు చెరువులు, వాగులు, కాల్వల్లో పిల్లలు ఈత కొట్టడాన్ని మనం చూస్తూనే ఉంటాం. వీరిలో వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, సరదా కోసం ఇంకొందరు, ఈత నేర్చుకోవడానికి మరికొందరు వెళ్తుంటారు. సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా నీటిలో దిగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఓ కన్నేసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.