News March 26, 2024

అర్చకులను కాలితో తన్నడం రాక్షస చర్య: చంద్రబాబు

image

AP: కాకినాడలో పూజారులపై దాడిని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అర్చకులను కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య అని మండిపడ్డారు. ‘అర్చకుడంటే దేవుడు, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తాం. వారి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనది. వైసీపీ నేతల మదానికి ఇది నిదర్శనం’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News March 16, 2026

LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్‌లు: CBN

image

AP: గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు పోకుండా చూడాలని CBN కంపెనీల అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, గుడులకు గ్యాస్ సరఫరా ఆగకుండా చూడాలన్నారు. ప్రజల్లో ఆందోళన లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్స్ వినియోగించేలా చేయాలన్నారు. LPG వాడకం తగ్గించేలా హోటళ్లతో చర్చించాలని సూచించారు. రాష్ట్రంలో 17,209MT స్టాక్ ఉందని CMకు అధికారులు తెలిపారు.

News March 16, 2026

మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ కన్నుమూత

image

TG: ఉమ్మడి ఆదిలాబాద్(D) ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్(71) అనారోగ్యంతో మృతిచెందారు. దండేపల్లి(M) లింగాపూర్‌లోని తన స్వగృహంలో ఈరోజు తుది శ్వాస విడిచారు. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి సారి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా(1985) గెలుపొందిన ఆయన, ఆ తర్వాత TDP(1994), BRS(2004) నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

News March 16, 2026

గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు

image

LPGకి హైడిమాండ్ నెలకొన్న వేళ PNG కనెక్షన్లకు ప్రజలను ఆకర్షించేందుకు గ్యాస్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. MAR 31లోగా రిజిస్టరయ్యే డొమెస్టిక్ యూజర్లకు GAIL, ఇంద్రప్రస్థ గ్యాస్ సంస్థలు ₹500 విలువైన ఫ్రీ గ్యాస్ అందించనున్నాయి. మహానగర్ గ్యాస్.. కమర్షియల్‌ కనెక్షన్ల సెక్యూరిటీ డిపాజిట్ (₹1L-5L), డొమెస్టిక్‌‌ రిజిస్ట్రేషన్ ఫీ (₹500)పై మినహాయింపు ఇచ్చింది. BPCL కూడా కమర్షియల్‌పై జీరో డిపాజిట్ ప్రకటించింది.