News April 3, 2025
వైఎస్ సునీత ప్రాణాలకు ముప్పు.. షర్మిల సంచలన ఆరోపణలు

AP: వివేకా హత్య కేసు నిందితులు ఆయన కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉందని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఎంపీ అవినాశ్ బెయిల్‌పై ఉన్నందునే ఆమెకు న్యాయం జరగట్లేదన్నారు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇలాగైతే న్యాయం ఎప్పుడు జరుగుతుందని న్యాయస్థానాలను ప్రశ్నించారు.
Similar News
News April 17, 2025
ఘనంగా అర్జున్ సర్జా కుమార్తె ఎంగేజ్‌మెంట్

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా చిన్న కూతురు అంజన త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. తాజాగా ఇటలీలో ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. 13 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అనే అర్థంలో ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేశారు. వరుడు విదేశీయుడు కాగా ఇతర వివరాలేవీ తెలియరాలేదు. అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నటుడు ఉమాపతి రామయ్యను గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
News April 17, 2025
ఆ ప్లేయర్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్?

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో యువ ఆటగాళ్లు చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జాతీయ జట్టులో సత్తా చాటిన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాకు కాంట్రాక్ట్ దక్కవచ్చని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. అభిషేక్‌కు సీ-గ్రేడ్‌లో చోటు దక్కవచ్చని అభిప్రాయపడింది. కాగా BCCI పాలసీ ప్రకారం కాంట్రాక్ట్‌లో చోటు దక్కాలంటే ప్లేయర్ కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20Iలు ఆడి ఉండాలి.
News April 17, 2025
చిన్నారుల భవిష్యత్తుకు అండగా ఉంటాం: సచిన్

చిన్నారుల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు సచిన్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ చేతులు కలిపాయి. మేఘాలయ ప్రభుత్వ భాగస్వామ్యంతో రెండు సంస్థలు పనిచేయనున్నాయి. ఈ మేరకు క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు. మూలాలపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్న విషయం మేఘాలయా పర్యటనతో అర్థమైందన్నారు. పిల్లల ఆత్మస్థైర్యం, లోకల్ టీమ్స్ నిబద్ధత ఈ ప్రయాణంలో తమకు స్ఫూర్తినిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.