News April 3, 2025
సంగారెడ్డి జిల్లాలో కుళ్లిన శవం లభ్యం

సంగారెడ్డి జిల్లాలో కుళ్లిపోయిన శవం కలకలం రేపుతోంది. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ శివారులో గురువారం గుర్తుతెలియని వ్యక్తి శవం దొరికిందని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. గుర్తుపట్టలేకుండా మృతదేహం కుళ్లిపోయిందని, అతడి వయసు 30- 40 ఏళ్లు మధ్య ఉండి, పైన బ్లూ కలర్ డ్రాయర్ ఉందన్నారు. మృతుడి గురించి ఎవరికైనా తెలిస్తే ఇంద్రకరణ్ ఎస్ఐ నంబర్ 8712656747, సంగారెడ్డి రూరల్ సీఐ నంబర్ 87126 56719 కు సంప్రదించాలన్నారు.
Similar News
News April 10, 2025
నాగర్‌కర్నూల్: ఏప్రిల్ 16న ఉచిత కంటి వైద్య శిబిరం: నేత్రాధికారి

నాగర్ కర్నూల్ పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఏప్రిల్ 16వ తేదీన కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని జిల్లా నేత్రాధికారి కొట్ర బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. అంధత్వ నియంత్రణ సంస్థ నాగర్ కర్నూల్& మహబూబ్‌నగర్ వారి ద్వారా కంటి పరీక్షలు, ఆపై కంటి శుక్లాలు గల వారికి ఆపరేషన్లు నిర్వహించి కళ్లద్దాలు ఇస్తామన్నారు. దృష్టి లోపం గల వారికి సలహాలు, మందులు ఇస్తామని, వివరాలకు 7386940480 సంప్రదించాలన్నారు.
News April 10, 2025
నాగర్ కర్నూల్ డిపో నుంచి సళేశ్వరం క్షేత్రానికి ప్రత్యేక బస్సులు

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన సళేశ్వరం లింగమయ్య క్షేత్రానికి ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సులు నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
News April 10, 2025
నర్సీపట్నం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

గుల్లిపాడు- నర్సీపట్నం స్టేషన్ మధ్య ట్రైన్ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రెండు రోజుల క్రితమే జారిపడి మృతి చెంది ఉంటాడని ఎస్ఐ తెలిపారు. మృతుడు ఎవరు అనేది తెలియరాలేదని, మృతుడు ఎడమ చేయిపై జ్యోతి అనే పచ్చబొట్టు ఉందని ఎస్ఐ వివరించారు.