News April 3, 2025
KMR: ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి మండలం కన్నాపూర్‌లో గురువారం కలెక్టర్ కొబ్బరి కాయ కొట్టి ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 10, 2025
NLG: త్వరలో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు

NLG రీజియన్‌కు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. తొలిసారి కాలుష్య రహిత సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లు రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ మార్పులు చేస్తూ ప్రయాణికులను పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇంధనం ఖర్చు తగ్గించుకుని ఈ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. NLG రీజియన్‌కు 152 బస్సులను కేటాయించారు.
News April 10, 2025
రేషన్‌లో రాగులు.. జూన్ నుంచి పంపిణీ

AP: వచ్చే జూన్ నుంచి రేషన్ షాపుల్లో రాగులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా అందించనుంది. ప్రతి నెలా 20 కేజీల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీల రాగులు కావాలంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారు. ఇందుకు ఏటా 25వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని అంచనా. ఆ మేరకు రాగుల సేకరణకు టెండర్ జారీ చేసింది.
News April 10, 2025
వైఎస్ జగన్ రామగిరి పర్యటన.. కేసు నమోదు

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనపై కేసు నమోదైంది. వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లగా అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ రంగారెడ్డి అస్వస్థతకు గురై అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సీకేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.