News April 3, 2025
FLASH: వనపర్తి జిల్లాలో యాక్సిడెంట్

వనపర్తి జిల్లా పెబ్బేర్‌లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక భవాని వైన్స్ ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న కంచిరావుపల్లి గ్రామానికి చెందిన విష్ణుచారిని AP39UC7200 నంబర్ గల లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు చేయి, కాలు నుజ్జునుజ్జయింది. పెబ్బేర్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News April 10, 2025
యమగూచి చేతిలో ఓడిన సింధు

జపాన్ బ్యాడ్మింటన్ సంచలనం యమగూచి మరోసారి పీవీ సింధుకి షాక్ ఇచ్చారు. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 21-12, 16-21, 21-16 తేడాతో సింధును ఓడించారు. మరోవైపు మెన్స్ సింగిల్స్‌లో భారత ప్లేయర్ రాజావత్‌ను 21-14, 21-17 తేడాతో జపాన్ ఆటగాడు కొడాయ్ నరవొక మట్టికరిపించారు. దీంతో సింగిల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది.
News April 10, 2025
వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు.. కిరణ్ అరెస్టు

AP: వైఎస్ జగన్ భార్య భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన <<16050680>>చేబ్రోలు కిరణ్ కుమార్‌ను<<>> గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడిని మంగళగిరి రూరల్ PSకు తీసుకెళ్లారు. కాగా కిరణ్‌ను టీడీపీ ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
News April 10, 2025
కామారెడ్డి జిల్లాలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి జిల్లాలో 7వేల ఎకరాలలో జొన్న పంటను రైతులు పండించారని మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జొన్న పంట కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, ఆర్గొండ, కారేగావ్, గాంధారి, పిట్లం, పుల్కల్, తిమ్మానగర్, గుంకుల్, బోర్లం, పెద్దకొడప్గల్, చిన్న కోడప్గల్, ఎల్లారెడ్డి, పద్మాజీవాడి, ముదేల్లిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.