News April 3, 2025

రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు

image

AP: విశాఖలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన 35 ఎకరాల్లో 15.17 ఎకరాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఓ ప్రయోజనం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని మిగతా వాటికోసం వినియోగిస్తే రద్దు చేయాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం స్టూడియోకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా కలెక్టర్‌ను ఆదేశించారు.

Similar News

News April 10, 2025

KOHLI: మరో 2 బౌండరీలు బాదితే చరిత్రే

image

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. మరో 2 బౌండరీలు బాదితే IPLలో 1,000 బౌండరీలు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలవనున్నారు. ఇప్పటివరకు 265 మ్యాచుల్లో 278 సిక్సర్లు, 720 ఫోర్లు బాదారు. ఆ తర్వాతి స్థానంలో ధవన్(920), డేవిడ్ వార్నర్(899), రోహిత్ శర్మ(885) ఉన్నారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులోనే కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తాడా? లేదా? అనేది కాసేపట్లో తేలనుంది.

News April 10, 2025

గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలక మార్పులు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలను A, B, C కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. 2500లోపు జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు, 2501-3500 జనాభా ఉన్న సచివాలయానికి ముగ్గురు, 3501కి పైగా జనాభా ఉన్న సచివాలయానికి నలుగురు సిబ్బందిని కేటాయించింది. రియల్ టైమ్‌లో పౌరసేవలు అందించేలా సిబ్బందికి విధులు అప్పగించింది.

News April 10, 2025

ALERT: పరీక్ష తేదీ మార్పు

image

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించనున్న పరీక్ష తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆరోజు ఈస్టర్ పర్వదినం కావడంతో పరీక్షను మరుసటి రోజు 21కి మార్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని విద్యాశాఖ సూచించింది. www.cse.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

error: Content is protected !!