News April 3, 2025
వనపర్తి: ‘ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని పునః సమీక్షించండి’

ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని(AEBAS) తక్షణమే పునః సమీక్షించాలని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇతర ప్రత్యామ్నాయ హాజరు విధానాన్ని అనుమతించాలని కోరుతూ గురువారం వనపర్తి డీఎంహెచ్‌వో శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల వాస్తవ సమస్యలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 10, 2025
రేపు ఓటీటీలోకి ‘ఛావా’ మూవీ

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ మూవీ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.
News April 10, 2025
కంచ భూముల వ్యవహారం.. కమిటీకి ప్రభుత్వం నివేదిక

TG: కంచ గచ్చిబౌలి భూముల <<16050278>>పరిశీలనకు<<>> వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల భేటీ ముగిసింది. ఆ భూములు తమవేనని చెబుతున్న సర్కార్ అందుకు సంబంధించిన నివేదికను కమిటీకి అందించింది. దాన్ని పరిశీలించిన తర్వాత కమిటీ సభ్యులు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సమర్పించనున్నారు.
News April 10, 2025
భీమవరం పొలాల్లో చెట్టుకి వేలాడుతున్న మృతదేహం

ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలోని శేషాయిగుంట పొలాల్లో చెట్టుకి యువకుడి మృతదేహం వేలాడుతున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. ఓ గొర్రెల కాపరి గమనించి గ్రామపెద్దలకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి యువకుడు పోలూరు మహేశ్ (27)గా గుర్తించారు. మృతుడికి సంవత్సరం కిందట వివాహమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.