News April 3, 2025
నంగునూర్: గులాబీ పువ్వులతో కనువిందు

ఆకాశం లేత నీలం రంగులో మెరిసిపోతోంది. అక్కడక్కడ తెల్లటి మేఘాలు తేలియాడుతున్నాయి. నేలపై రాలిన లేత గులాబీ రంగు పూలతో వీధి చాలా అందంగా ఉంది. ఈ సమ్మోహన దృశ్యం సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలం గట్లమల్యల గ్రామంలో చోటు చేసుకుంది. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో నాటిన మొక్క నేడు వృక్షంగా మారి గులాబి పువ్వులతో ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఒక పెద్ద చెట్టు గులాబీ రంగు పూలతో పూర్తిగా నిండిపోయి ఆకర్షిస్తోంది.
Similar News
News April 15, 2025
ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 15, మంగళవారం)

ఫజర్: తెల్లవారుజామున 4.46 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.00 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు అసర్: సాయంత్రం 4.42 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.32 గంటలకు ఇష: రాత్రి 7.46 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 15, 2025
అన్నమయ్య: గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణం ప్రారంభం

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం రాత్రి బసినికొండలో గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. యువతకు క్రీడల్లో స్ఫూర్తిని నింపే విధంగా ఇప్పటికే సెటిల్, క్రికెట్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బసినికొండ వద్ద నూతనంగా గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణం ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్.సేతు, షంషీర్, హరి పాల్గొన్నారు.
News April 15, 2025
శుభ ముహూర్తం (15-04-2025)(మంగళవారం)

తిథి: బహుళ విదియ ఉ.8.30 వరకు తదుపరి తదియ.. నక్షత్రం: విశాఖ రా.12.50 వరకు తదుపరి అనురాధ.. శుభసమయం: సామాన్యం.. రాహుకాలం: ప.3.00-4.30 వరకు.. యమగండం: ఉ.9.00-మ.10.30వరకు దుర్ముహూర్తం: ఉ.8.24-9.12 వరకు, రా.10.48-11.36 వరకు.. వర్జ్యం: శే.తె.6.14వరకు పున: తె.5.12 లగాయతు.. అమృత ఘడియలు: సా.3.05 నుంచి 4.51 వరకు