News March 26, 2024

జగిత్యాల: రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టిన హోలీ వేడుకలు

image

హోలీ వేడుకలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలో యువకుడు విసిరిన కోడిగుడ్డు పక్కింటిపై పడటంతో వివాదం జరిగింది. కోడిగుడ్డు విసిరిన ప్రకాష్ అనే యువకుడిని పక్కింట్లో ఉండే రమ ప్రశ్నించడంతో ప్రకాష్ కొడవలితో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

Similar News

News January 14, 2026

KNR జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా నవీన్‌కుమార్ గౌడ్

image

కరీంనగర్ జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా సైదాపూర్ ఉప సర్పంచ్ గోపగోని నవీన్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఉప సర్పంచ్ల సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా నామని విజేందర్, ఉపాధ్యక్షులుగా దొంతరవేనా రమేష్, గుండారపు మహేష్, కట్కమ్ మనీష్, సంయుక్త కార్యదర్శులుగా మిడిదొడ్డి సుధాకర్, జక్కుల అనిల్, అధికార ప్రతినిధిగా మేకల మహేష్‌ను ఎన్నుకున్నారు.

News January 14, 2026

KNR: సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత

image

కరీంనగర్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శాపంగా మారింది. రెగ్యులర్ అధికారులు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. తిమ్మాపూర్ వంటి చోట్ల 3 నెలల్లోనే నలుగురు అధికారులు మారడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, తగిన అవగాహన లేక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని క్రయవిక్రయదారులు వాపోతున్నారు.

News January 14, 2026

KNR: 6 నెలలకోసారి వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహిళలు 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రేకుర్తిలోని పల్లె దవాఖానాను ఆమె సందర్శించారు. ఈ దవాఖానాలో నిర్వహిస్తున్న ‘ఆరోగ్య మహిళా వైద్య’ పరీక్షలను పరిశీలించారు. పలువురు మహిళలకు బీపీ పరీక్షలు చేయించి, వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి మహిళా వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.