News April 3, 2025

త్వరలో ‘బుడమేరు’ మరమ్మతులకు టెండర్లు: నిమ్మల

image

AP: గతేడాది విజయవాడను ముంచెత్తిన ‘బుడమేరు’ మరమ్మతులకు త్వరలో టెండర్లు పిలవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ పెండింగ్ పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్థ్యం పెంపు, దానికి సమాంతరంగా కొత్త ఛానెల్ అభివృద్ధిపై ఫోకస్ చేయాలన్నారు. వరదల నియంత్రణకు కేంద్ర సాయంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.

Similar News

News November 15, 2025

బిహార్: ఓట్ షేరింగ్‌లో ఆర్జేడీనే టాప్

image

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఓట్ షేర్ పరంగా చూసుకుంటే తేజస్వీ పార్టీ ఆర్జేడీ(23%)దే అత్యధికం. అయినప్పటికీ ఈ పార్టీ 25 స్థానాల్లోనే గెలిచింది. అటు 20.08% ఓట్లతో బీజేపీకి అత్యధికంగా 89 సీట్లు, 19.25% ఓట్లతో జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 8.71శాతం(6సీట్లు) ఓట్లు రాగా, ఇతరులకు 17శాతం రావడం గమనార్హం.

News November 15, 2025

భూకంపాలను పసిగట్టే ప్రాచీన భారత టెక్నాలజీ

image

భూకంపాలను గుర్తించే సాంకేతికత ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి సవాలే. కానీ, వేల ఏళ్ల క్రితమే మన భారతీయ శాస్త్రాలు భూకంపాల పూర్వ సూచనలను చెప్పే గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాయి. సుమారు 1,500 సంవత్సరాల క్రితం వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత అనే గ్రంథంలో, భూకంపాలకు ముందు ప్రకృతిలో వచ్చే అసాధారణ వాతావరణ మార్పులను (పశుపక్ష్యాదుల ప్రవర్తన, భూగర్భ జలాల్లో మార్పులు) క్షుణ్ణంగా వివరించారు. <<-se>>#VedikVibes<<>>

News November 15, 2025

CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు: రాష్ట్ర ప్రభుత్వం

image

AP: సీఐఐ సదస్సులో తొలి రోజు 365 సంస్థలతో రూ.8,26,668 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమ్మిట్ ముందు రోజుతో కలిపి 400 MoUలు, రూ.11,99,971 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది. దీంతో 13,32,445 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న విశ్వాసాన్ని మరోసారి రుజువుచేసిందని తెలిపింది.