News April 3, 2025

బాధితులకు అండగా భరోసా: MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు భరోసా సెంటర్ నిలుస్తోందని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ అన్నారు. భరోసా సెంటర్ నుంచి 8 మంది బాధితులకు అందాల్సిన రూ.65 వేల చెక్కులు, ఒకరికి కుట్టు మిషన్‌ను ఆయన గురువారం అందజేశారు. ఆయనతో పాటు డీఎస్పీ తిరుపతిరావు, ఎస్ఐ దీపికా రెడ్డి, భరోసా ఎస్ఐ ఝాన్సీ, తదితరులు ఉన్నారు.

Similar News

News April 10, 2025

వేసవి రద్దీ మేరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు 

image

వేసవిలో ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB), నారంగి(NNGE) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 15 నుంచి 29 వరకు ప్రతి మంగళవారం SMVB-NNGE(నెం.06559), ఏప్రిల్ 12 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం NNGE- SMVB(నం.06560) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్‌లలో ఆగుతాయన్నారు. 

News April 10, 2025

KOHLI: మరో 2 బౌండరీలు బాదితే చరిత్రే

image

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. మరో 2 బౌండరీలు బాదితే IPLలో 1,000 బౌండరీలు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలవనున్నారు. ఇప్పటివరకు 265 మ్యాచుల్లో 278 సిక్సర్లు, 720 ఫోర్లు బాదారు. ఆ తర్వాతి స్థానంలో ధవన్(920), డేవిడ్ వార్నర్(899), రోహిత్ శర్మ(885) ఉన్నారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులోనే కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తాడా? లేదా? అనేది కాసేపట్లో తేలనుంది.

News April 10, 2025

రాయచోటిలో రెండు రోజులు ట్రాఫిక్ మళ్లింపు

image

ఈ నెల11న కడప జిల్లా ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఈ నెల 11ఉదయం10 గంటల నుంచి 12 వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని చెప్పారు

error: Content is protected !!