News April 3, 2025
కొడంగల్: పిడుగుపాటుతో గొర్రెలు, మేకలు మృతి

కొడంగల్ మండలం ఖాజా అహ్మద్‌పల్లి గ్రామంలో పిడుగు పాటుతో గొర్రెలు, మేకలు మృతి చెందాయి. పకీరప్ప రోజు మాదిరిగా జీవాలను మేతకు వెళ్లారు. అకాల వర్షం నేపథ్యంలో దాదాపు 30 మేకలు, గొర్రెలు చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు పడింది. దీంతో 25 జీవాలు మృతిచెందగా దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన పకీరప్ప కోరుతున్నారు.
Similar News
News April 8, 2025
NRPT: మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ స్థాపనకు దరఖాస్తులు ఆహ్వానం

రాజీవ్ యువ వికాస్ పథకం కింద మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రాల స్థాపనకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కామన్ సర్వీ మేనేజర్ దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు 70% నుంచి 80% ప్రభుత్వ సబ్సిడీ అందుతుందన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవచ్చన్నారు. ISBలో డీటీపీ, కంప్యూటర్ సెంటర్, జిరాక్స్ సెంటర్ ఎంచుకోవాలన్నారు. పూర్తి వివరాలకు స్థానిక ఎంపీడీవో అధికారిని సంప్రదించాలన్నారు.
News April 8, 2025
నార్సింగి : భర్తతో గొడవ ఆత్మహత్య

భర్తతో గొడవ పడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి మండలంలోని వల్లూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరుకి చెందిన మౌనిక (30)భర్త సురేష్‌తో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. భర్త పనికి వెళ్లి వచ్చేసరికి మౌనిక ఈ దుర్ఘటనకు పాల్పడిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News April 8, 2025
బాలీవుడ్ నటిపై వారెంట్ జారీ చేసిన కోర్టు

బాలీవుడ్ నటి మలైకా అరోరాపై ముంబైలోని ఓ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012లో నటుడు సైఫ్ అలీఖాన్, మలైకా, కరీనా తదితర స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ మరో కస్టమర్‌తో గొడవ కాగా అతడిపై ఆయన దాడి చేశారు. అప్పటి నుంచీ ఆ కేసు విచారణలో ఉంది. సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు రాకపోవడంతో ఇప్పటికే ఓసారి వారెంట్ జారీ చేసిన కోర్టు, తాజాగా మరోసారి వారెంట్ ఇష్యూ చేసింది.