News April 3, 2025
GHMC అప్రమత్తంగా ఉంది: మంత్రి పొన్నం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టీ టీమ్స్ వాటిని క్లియర్ చేస్తుందని పేర్కొన్నారు.
Similar News
News April 10, 2025
HYDలో ఒక్కసారిగా మారిన వాతావరణం

నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. నగరశివారుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. షాద్‌నగర్‌లో అయితే భారీ వర్షం కురిసింది. వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది. కామెంట్ చేయండి
PIC CRD: @prudhvikoppaka
News April 10, 2025
HYD: సామూహిక సీమంతాల్లో పాల్గొన్న కలెక్టర్

హిమాయత్‌నగర్ సెక్టార్ బీమా మైదాన్ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ‘గర్భిణులకు సరైన పోషకాహారం అత్యవసరం. అంగన్వా డీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. శిశు ఆరోగ్యం దేశ భవిష్యత్తు ఆధారం’ అని కలెక్టర్ పేర్కొన్నారు. DWO అక్కేశ్వరరావు, CDPO కృష్ణ చైతన్య, సూపర్వైజర్ బాలా, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
News April 10, 2025
FLASH..శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్‌పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బేగంపేట్ ప్రగతి భవన్ వద్ద యాక్సిడెంట్లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.