News April 3, 2025
రికార్డుస్థాయి వర్షపాతం

TG: హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. 2 గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో సరూర్ నగర్, హిమాయత్ నగర్‌లో 84.8mm, చార్మినార్ 84mm, ముషీరాబాద్‌లో 80.5mm వర్షపాతం నమోదైంది. దాదాపు అన్నిచోట్ల 66mm పైనే వాన కురిసింది. ఏప్రిల్‌లో ఈస్థాయి వర్షం పడటం ఇదే తొలిసారని తెలుస్తోంది. కాగా అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News April 14, 2025
రెండ్రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు మండుతాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర, యానాం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
News April 14, 2025
సిక్స్ కొట్టినా, వికెట్ తీసినా రూ.లక్ష.. ఎందుకో తెలుసా?

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)కు చెందిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు, బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కు లక్ష పాకిస్థానీ రూపాయల($356) చొప్పున పాలస్తీనా చారిటబుల్ సంస్థలకు విరాళంగా ఇస్తామని ప్రకటించింది. అక్కడి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే వాటికి ప్రాధాన్యత ఇస్తామంది. కరాచీ కింగ్స్‌తో తొలి మ్యాచ్ తర్వాత 1.5M PKRను డొనేట్ చేసినట్లు తెలిపింది.
News April 14, 2025
ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో మన వాటా 3.54%

ప్రపంచ వ్యాప్తంగా 2022లో 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగైతే, అందులో 95 లక్షల టన్నులతో భారతదేశం 3.54 శాతం వాటా కలిగి ఉందని నేచర్ జర్నల్‌లోని ఓ కథనం తెలిపింది. 8.15 కోట్ల టన్నుల చెత్త ఉత్పన్నంతో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతూనే ఉన్నా ప్రజల్లో ఆచరణ అంతంతమాత్రంగానే ఉంటోంది.