News April 3, 2025

సిద్దిపేట: బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం

image

బీజేపీ సిద్దిపేట జిల్లా పదాధికారుల సమావేశాన్ని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకోని జిల్లా అంతటా వారం రోజుల పాటు కార్యక్రమాల నిర్వహించాలని సూచించారు.

Similar News

News April 10, 2025

ఈ ఐదు ఆహారాలను వేడి చేసి తినకండి!

image

ఆహారాన్ని పలుమార్లు వేడి చేసి తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆలుగడ్డను వేడి చేస్తే ఇందులో ఉండే నైట్రేట్లు వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణమవుతాయి. పాలకూరలో ఉండే నైట్రేట్లు, అమినో యాసిడ్‌తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారొచ్చు. మష్రూమ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండె జబ్బులొస్తాయి. కోడిగుడ్డు కూడా తాజాగానే తినాలి. టీని కూడా మళ్లీ వేడి చేసి తాగొద్దు. SHARE IT

News April 10, 2025

లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

image

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర  అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.

News April 10, 2025

కొండగట్టులో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రేపటి నుంచి జరగబోయే చిన్న జయంతి ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, డిఎస్పి రవిచందర్, సీఐ నీలం రవి, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!