News March 26, 2024

మాజీ సీఎం KCRను కలిసిన నల్గొండ MP అభ్యర్థి  

image

మాజీ సీఎం KCRను కలిసిన నల్గొండ MP అభ్యర్థి  కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కలిశారు. ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులను కలుపుకుని లోక్ సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని కేసీఆర్ వారికి సూచించారు. ప్రజలతో మమేకమైతే తప్పకుండా విజయం సాధ్యమవుతుందని చెప్పారు. 

Similar News

News March 12, 2026

NLG: IFSC కోడ్ మార్పుతో అన్నదాతల అవస్థలు

image

బ్యాంకుల విలీనం, పేరు మార్పు వల్ల తలెత్తిన సాంకేతిక సమస్యలు నల్గొండ జిల్లాలోని వేలాది మంది రైతుల పాలిట శాపంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌గా మారడంతో IFSC కోడ్‌లు మారిపోయాయి. కాగా, ప్రభుత్వం పాత కోడ్‌ల ఆధారంగా నిధులు విడుదల చేసింది. ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్’ ఫెయిల్ అయ్యి సుమారు 7,041 మంది రైతులకు రుణమాఫీ సొమ్ము జమ కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 12, 2026

క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని, మున్సిపల్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

News March 12, 2026

NLG: ఒంటిపూట కూడా మిడ్ డే మీల్స్

image

ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పనిదినం (ఏప్రిల్ 23) వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సగం రోజు మాత్రమే పని చేస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మ.12:30 గంటల వరకు తరగతులు నిర్వహించి, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే రోజున మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సా.5 వరకు తరగతులు నడుస్తాయని DEO భిక్షపతి గురువారం తెలిపారు. ఈ సమయంలో కూడా మధ్యాహ్న భోజనం పెడతారు.