News April 3, 2025
మహబూబ్‌నగర్, మక్తల్‌లో కొత్త బార్ల కోసం నోటిఫికేషన్

పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల్లో కొత్త బార్ల కోసం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుదారుడు రూ.లక్ష నాన్ రిఫండబుల్ ఫారం-A ద్వారా దరఖాస్తులు నింపి జిల్లా మద్య నిషేధ & ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో మహబూబ్‌నగర్ లేదా హైదరాబాద్‌లో ఏప్రిల్ 26లోపు సమర్పించాలన్నారు. https://tgbcl.telangana.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.
Similar News
News April 11, 2025
తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలి: ఎమ్మెల్యే

సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు HYDలోని జల సౌధ భవనంలో రాష్ట్ర సాగునీటి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు. తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. జిల్లాతో పాటు HYDకు నీరు సరఫరా చేయడం సాధ్యమవుతుందన్నారు.
News April 11, 2025
మాజీ ప్రియురాలిపై యువకుడి విచిత్ర ప్రతీకారం!

కోల్‌కతాలోని లేక్‌టౌన్ ప్రాంతంలో సుమన్ సిక్దర్ అనే యువకుడు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై విచిత్రంగా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తనకు బ్రేకప్ చెప్పిందన్న కోపంతో 4 నెలల వ్యవధిలో 300కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ పార్సిల్స్‌ను ఆమె ఇంటికి బుక్ చేశాడు. ఆ డెలివరీలు తనకెందుకు వస్తున్నాయో తెలియక తీవ్ర ఒత్తిడికి గురైన యువతి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 11, 2025
వాహనాలను తీసుకవెళ్లండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించాలని నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందజేయబడుతుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.