News April 3, 2025

అనకాపల్లి: ప్రభుత్వానికి 30.46 ఎకరాల భూమి అప్పగింత

image

ప్రభుత్వ భూముల్ని కాజేస్తున్న ఈరోజుల్లో సర్కారుకే తిరిగి భూముల్ని అప్పగించిన ఘటన అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట(M) చిన భీమవరంలో చోటుచేసుకుంది. కూర్మన్నపాలేనికి చెందిన వ్యాపారవేత్త కడియాల రాజేశ్వరరావు గతంలో 30.46 ఎకరాల డిపట్టా భూములను కొనుగోలు చేశారు. గురువారం కలెక్టర్ విజయ్ కృష్ణన్‌ను కలిసి ఆ భూములపై సర్వహక్కులను వదులుకుంటున్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ సుమారు రూ.8కోట్లపైనే.

Similar News

News April 11, 2025

విషాదం: NIT విద్యార్థి ఆత్మహత్య

image

వరంగల్ జిల్లాలోని NITలో విషాదం చోటుచేసుకుంది. సంస్థలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్ సాయి అనే విద్యార్థి స్థానిక వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం హైదరాబాద్‌ కాగా ఎన్‌ఐటీ హాస్టల్‌లోనే నివాసముంటున్నాడని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2025

తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలి: ఎమ్మెల్యే

image

సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు HYDలోని జల సౌధ భవనంలో రాష్ట్ర సాగునీటి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు. తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. జిల్లాతో పాటు HYDకు నీరు సరఫరా చేయడం సాధ్యమవుతుందన్నారు.

News April 11, 2025

మాజీ ప్రియురాలిపై యువకుడి విచిత్ర ప్రతీకారం!

image

కోల్‌కతాలోని లేక్‌టౌన్ ప్రాంతంలో సుమన్ సిక్దర్ అనే యువకుడు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై విచిత్రంగా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తనకు బ్రేకప్ చెప్పిందన్న కోపంతో 4 నెలల వ్యవధిలో 300కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ పార్సిల్స్‌ను ఆమె ఇంటికి బుక్ చేశాడు. ఆ డెలివరీలు తనకెందుకు వస్తున్నాయో తెలియక తీవ్ర ఒత్తిడికి గురైన యువతి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

error: Content is protected !!