News April 3, 2025
భవన నిర్మాణ కార్మికులకు తంబు రద్దు చేయాలి: AITUC

భవన నిర్మాణ కార్మికులకు తంబు విధానాన్ని రద్దు చేసి, నిర్మాణ రంగంలో పనిచేస్తూ 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని(AITUC) తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేటలోని శ్రామిక భవన్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం 2వ మహాసభలో పాల్గొని మాట్లాడారు.
Similar News
News November 15, 2025
బిహార్ రిజల్ట్స్: 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. జోకిహట్, బహదుర్గంజ్, కొచ్చదామన్, అమౌర్, బైసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అభ్యర్థులందరికీ 20వేలకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. 2020 ఎన్నికల్లో ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అదనంగా బహదుర్గంజ్ స్థానంలో గెలవడం విశేషం. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసింది.
News November 15, 2025
కామారెడ్డి: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు కామారెడ్డి DEO రాజు తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.50తో ఈ నెల 21 నుంచి 29 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. రూ.200 లేట్ ఫీజుతో DEC 2 నుంచి 11 వరకు, రూ.500 లేట్ ఫీజుతో DEC 15 నుంచి 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
News November 15, 2025
జగిత్యాల: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడి భార్యను హత్య చేసిన భర్తకు జగిత్యాల జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి నారాయణ జీవిత ఖైదుతో పాటు రూ.పది వేల జరిమానా విధించారు. మెట్‌పల్లికి చెందిన వాల్గోట్ కిశోర్(32) భార్య నిషిత(28)ను 28-12-2021న ఇంట్లో గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయగా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం శిక్షను అమలు చేశారు.


