News April 3, 2025
డేటింగ్, పెళ్లిపై ఆర్జే మహవాష్ కీలక వ్యాఖ్యలు

పెళ్లి, డేటింగ్ విషయాలపై క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను సింగిలే కానీ, సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్‌గా డేట్స్‌కి వెళ్లను. ప్రస్తుతం నేను వివాహం అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే, నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చారు.
Similar News
News November 14, 2025
హరీశ్‌కు అసూయ, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు: రేవంత్

TG: అధికారం పోయినా హరీశ్ రావుకు అసూయ, KTRకు అహంకారం తగ్గలేదని CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘వారిద్దరు అసూయ, అహంకారం తగ్గించుకోవాలి. అసెంబ్లీలో రక్తమంతా మొహంలోకి తెచ్చుకుని హరీశ్ చూస్తుంటాడు. ఆ చూపులకు శక్తి ఉంటే మాడి మసైపోతాం’ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, వారసత్వ సంపద కాదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు. సమస్యలపై ధర్నాలు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.
News November 14, 2025
వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 14, 2025
‘ఫర్టిగేషన్’లో ఎరువులను ఎలా అందించాలి?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.


