News April 3, 2025
నర్సీపట్నంలో విషాదకర ఘటన

నర్సీపట్నంలో కొడుకు మృతి చెందాడనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. 15 రోజుల క్రితం కోన రాము ఆకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో తల్లి కోన గౌరీ చిన్న కుమారుడు మృతి చెందడంతో మానసిక క్షోభకు గురై దిగులతో ఉండిపోయింది. దీంతో ఈనెల 2న గౌరీ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆమెను వెతికే క్రమంలో గురువారం ఉత్తరవాహిని వద్ద శవమై కనిపించింది. పెద్ద కుమారుడు దుర్గారావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 11, 2025
నియోజకవర్గ మార్పుపై స్పష్టత ఇచ్చిన మంత్రి పొంగులేటి

రాబోయే ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి కాకుండా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంపై మంత్రి స్పష్టత ఇచ్చారు. పాలేరు ప్రజల ఆశీర్వాదంతోనే తాను మంత్రిగా కొనసాగుతున్నానని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పేర్కొన్నారు.
News April 11, 2025
మెదక్: ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లను ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను https://www.telanganaopenschool.org వెబ్సైట్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 11, 2025
NZB: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్ గ్రామంలో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.