News April 3, 2025
‘భవిష్యత్తు తరాల మనుగడకు సుస్థిరమైన పర్యావరణ పరిరక్షణ’

సుస్థిరమైన పర్యావరణ పరిరక్షణ భవిష్యత్తు తరాల మనుగడకు ఎంతో అవసరమని ప్రముఖ పర్యావరణ వేత్త రిటైర్డ్ ప్రొఫెసర్ కె.పురుషోత్తం అన్నారు. ప్రభుత్వ డిగ్రీ,పీ. జీ కళాశాలలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ (ICSSR) ఆర్థిక సహకారంతో ఐక్యూఏసీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.
Similar News
News April 11, 2025
పాలకుర్తి: మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్

పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తాలో నలుగురు మైనర్లు ఒకే బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎస్సై యాకూబ్ హుస్సేన్ వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
News April 11, 2025
BREAKING: తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.
News April 11, 2025
అపార్ట్ కార్డుల నమోదులో మొదటి స్థానంలో జగిత్యాల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే అపార్ కార్డుల నమోదులో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 1096 పాఠశాలలు ఉండగా.. 1,61,822 మంది విద్యార్థులు ఉన్నారు. అపార్ కార్డుల నమోదులో 88.73 శాతం చేసి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచేందుకు కృషిచేసిన జిల్లా విద్యాధికారి రామును ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.