News April 3, 2025
కార్యదర్శుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం

మెదక్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం(TPSF) గ్రామ కార్యదర్శులకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని జేపీఎస్, ఓపిఎస్ సెక్రటరీల పెండింగ్ వేతనాలు, గ్రామ పంచాయతీలో ఖర్చు చేసిన నిధులు సహా పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, టీపీఎస్ఎఫ్ జిల్లా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
మెదక్: ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లను ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను https://www.telanganaopenschool.org వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 11, 2025
మెదక్: చికిత్స పొందుతూ రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. రంగంపేట గ్రామానికి చెందిన ఎల్లయ్య (50) అనే రైతు బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తుండగా అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 10, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జర్నలిస్ట్ శ్రీధర్‌కు ఉగాది పురస్కారం

తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.