News April 3, 2025

HYD: భారీ వర్షం.. ప్రజలకు జలమండలి ఎండీ సూచనలు

image

భారీ వర్షంతో అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అప్రమత్తం చేశారు. హాట్ స్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోళ్ల మూతలు తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

Similar News

News July 5, 2025

HYD: ‘వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

image

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News May 8, 2025

ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News May 7, 2025

హయత్‌నగర్: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

image

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.