News April 3, 2025
మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించిన హరీశ్ రావు

కడ్తాల్ మండలం చరికొండ పంచాయతీలోని బోయిన్‌గుట్ట తండాలో నూతనంగా ఏర్పాటుచేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
విరాట్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్ విమర్శలు

నిన్న రాత్రి DCతో మ్యాచ్‌లో RCBకి సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. డీసీ బౌలర్ స్టార్క్ వేసిన ఒక ఓవర్లోనే 30 రన్స్ వచ్చాయి. బెంగళూరు కచ్చితంగా 220 ప్లస్ స్కోర్ చేస్తుందని ఫ్యాన్స్ భావించగా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో విరాట్ సాల్ట్‌ను రనౌట్ చేసి మంచి ఊపును దెబ్బతీశారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు విరాట్ తప్పులేదంటూ కొంతమంది కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.
News April 11, 2025
పాలకుర్తి: మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్

పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తాలో నలుగురు మైనర్లు ఒకే బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎస్సై యాకూబ్ హుస్సేన్ వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
News April 11, 2025
BREAKING: తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.