News April 3, 2025

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌‌లో పసుపు ధర ఇలా

image

జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పసుపు ధర ఈవిధంగా ఉన్నాయి. ఈరోజు పసుపు కాడి గరిష్ఠ ధర రూ.14,395, కనిష్ఠ ధర రూ.9,009, పసుపు గోళం గరిష్ఠ ధర రూ.13,556, కనిష్ఠ ధర రూ.8,888 పసుపు చూర గరిష్ఠ ధర రూ.10,445, కనిష్ఠ ధర రూ.9,292గా పలికిందని కార్యదర్శి తెలిపారు. ఈరోజు మొత్తం 1783 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 11, 2025

మెదక్: ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

image

ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లను ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను https://www.telanganaopenschool.org వెబ్సైట్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 11, 2025

NZB: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

image

నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్ గ్రామంలో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.

News April 11, 2025

NGKL: ‘తెలంగాణ.. టూరిజానికి టర్నింగ్ పాయింట్’

image

తెలంగాణలో పీపీపీ విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ముంబయిలో జరిగిన హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులకు రాయితీలు, పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. 2030 నాటికి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా తెలంగాణను టాప్-5 పర్యాటక రాష్ట్రాల్లో నిలపాలని తెలిపారు.

error: Content is protected !!