News March 26, 2024

సంగారెడ్డి: ఫేస్‌బుక్ పరిచయం.. రూ.8.57 లక్షలు కొట్టేసింది..!

image

సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పటాన్‌చెరు పరిధి  బీరంగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. లండన్ నుంచి HYD వస్తున్నానని నమ్మించి పలు దఫాలుగా రూ.8.57 లక్షలు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. అనంతరం రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Similar News

News March 10, 2026

భూ హక్కుల కోసమే రీ-సర్వే: అదనపు కలెక్టర్

image

భూములపై పక్కా హక్కులు కల్పించేందుకే రీ-సర్వే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం రామాయంపేట మండలం అక్కన్నపేటలో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో రూపొందించిన నక్షల్లో ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయడమే ఈ సర్వే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

News March 10, 2026

మెదక్: మహిళ మృతదేహం కలకలం

image

పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. మంగళవారం ఏడుపాయల వెళ్లే రహదారిలోని చెల్మికుంట అడవి ప్రాంతంలో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

News March 10, 2026

సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శనీయం: ఐసీడీఎస్ డైరెక్టర్

image

మెదక్ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా ప్రశంసించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో భేటీ అయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలోని కేంద్రాలు, సఖి సెంటర్లలో బాధితులకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.