News April 4, 2025

రూ.4,00,000 సాయం.. కీలక ప్రకటన

image

TG: రాజీవ్ యువ వికాసం <<15922104>>దరఖాస్తులపై <<>>BC కార్పొరేషన్ స్పష్టత ఇచ్చింది. దరఖాస్తుదారుల వద్ద రేషన్‌కార్డు ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, రేషన్‌కార్డు లేకుంటే ఇన్‌కమ్ సర్టిఫికెట్‌తో <>దరఖాస్తు<<>> చేసుకోవచ్చంది. 2016 తర్వాత తీసుకున్న కాస్ట్ సర్టిఫికెట్ చాలని, దరఖాస్తులను మండల/మున్సిపల్ ఆఫీసుల్లో ఈ నెల 14లోగా ఇవ్వాలని సూచించింది. రూ.4లక్షల వరకు సాయం అందించే ఈ స్కీంకు ఇప్పటివరకు 7 లక్షల మంది అప్లై చేశారు.

Similar News

News April 11, 2025

ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్‌లోనే: పరిశోధకులు

image

ప్రపంచంలోనే అత్యధిక క్షయ కేసులు భారత్‌లోనే నమోదవుతున్నాయని పలువురు పరిశోధకులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. క్షయపై చర్చించేందుకు హైదరాబాద్‌లో ప్రారంభమైన సదస్సులో వారు మాట్లాడారు. ‘క్షయ కారణంగా 2023లో 3 లక్షలమందికి పైగా కన్నుమూశారు. ముందే గుర్తిస్తే టీబీ మరణాన్ని అరికట్టొచ్చు. భారత్‌కు సవాలుగా మారిన దీనిపై అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

News April 11, 2025

వడ్డీ రాయితీ గడువు పొడిగింపు

image

AP: పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. 2024-25కు గాను ప్రజలు చెల్లించాల్సిన పన్నుపై ఈ రాయితీ వర్తిస్తుంది. మార్చి నెలాఖరుతోనే గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే సెలవుల వల్ల రాయితీ ఉపయోగించుకోలేకపోయామని విజ్ఞప్తులు రావడంతో పొడిగించింది.

News April 11, 2025

అంగన్‌వాడీ పిల్లలకు శనగలు, ఎగ్‌ఫ్రైడ్ రైస్

image

AP: అంగన్‌వాడీ కేంద్రాల మధ్యాహ్న భోజన మెనూలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. రుచితోపాటు ఎక్కువ పోషకాలుండేలా పిల్లలకు వారంలో 2 రోజులు ఎగ్‌ఫ్రైడ్ రైస్, ఉదయం ఉడికించిన శనగలు అందించనుంది. అలాగే కూరల్లో మునగపొడిని వాడనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 4 జోన్ల పరిధిలోని ఒక్కో కేంద్రంలో అమలు చేశారు. త్వరలో 26 జిల్లాల్లోని ఒక్కో కేంద్రంలో అమలు చేస్తారు. బాలామృతంలోనూ చక్కెర స్థాయి తగ్గించి మార్పులు చేస్తారు.

error: Content is protected !!