News April 4, 2025
నేటి ముఖ్యాంశాలు

TG: తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కంచ గచ్చిబౌలిలో చెట్లు కొట్టొద్దు: సుప్రీంకోర్టు
TG: SC తీర్పు HCU విద్యార్థుల విజయం: ప్రతిపక్షాలు
TG: HCU భూముల వివాదంపై కమిటీ వేసిన ప్రభుత్వం
TG: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
AP: అమరావతిని సందర్శించండి.. సామ్ ఆల్ట్‌మన్‌కు CM చంద్రబాబు ఆహ్వానం
US టారిఫ్‌లు, చైనా ఆక్రమణలపై ఏం చేస్తున్నారు?: రాహుల్
లోక్‌సభలో పాస్.. రాజ్యసభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు
Similar News
News April 11, 2025
అనారోగ్యంతో అప్పులపాలు.. ఆదుకుంటామని లోకేశ్ హామీ

AP: ఏలూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే చిరుద్యోగి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నరాలు, గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో రూ.7లక్షలకు పైగా ఆస్పత్రి ఖర్చులు అయ్యాయి. కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. అతడి పరిస్థితి తెలిసి, ప్రసాద్‌ను ఆదుకోవాలని టీడీపీ నేతలు మంత్రి లోకేశ్‌ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని తన టీమ్‌ను మంత్రి ఆదేశించారు.
News April 11, 2025
కియాలో 900 ఇంజిన్ల చోరీ.. ఇంటి దొంగల పనే!

AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా పరిశ్రమలో <<16027604>>900 ఇంజిన్ల చోరీపై<<>> విచారణ కొనసాగుతోంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తీసుకొచ్చే క్రమంలోనే దొంగతనం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ‘ఇందులో బయటివాళ్ల ప్రమేయం లేదు. కంపెనీ సిబ్బంది లేదా మాజీ ఉద్యోగుల హస్తం ఉంది. ఈ కేసులో ఎవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.
News April 11, 2025
అత్యధిక బిలియనీర్లు కలిగిన నగరాలివే!

ఈ ఏడాది అత్యధిక బిలియనీర్లు కలిగిన నగరాల్లో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 123 మంది బిలియనీర్లు ఉండగా వీరి మొత్తం విలువ $759 బిలియన్లుగా ఉంది. ఆ తర్వాత 90 మంది బిలియనీర్లు & $409 బిలియన్లతో మాస్కో రెండో స్థానంలో ఉంది. ముంబై రెండు స్థానాలు దిగజారి 6వ స్థానానికి చేరుకుంది. కాగా, ఇక్కడి 67 మంది బిలియనీర్ల నికర విలువ $349 బిలియన్లు. 3,4,5 స్థానాల్లో హాంకాంగ్, లండన్, బీజింగ్‌లు ఉన్నాయి.