News April 4, 2025

KMR: మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసు: SP

image

మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరంమని.. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇస్తే వారిపై కేసు నమోదు చేస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. కలెక్టరేట్‌లో రోడ్ సేఫ్టీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 28 బ్లాక్ స్పాట్‌లను ఇప్పటి వరకు గుర్తించినట్లు తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు.

Similar News

News September 19, 2025

HYD: బతుకమ్మ వేడుక.. బస్సులు సిద్ధం ఇక

image

బతుకమ్మ వేడుకలు.. దసరా సెలవులు త్వరలో రానుండటంతో సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. MGBS, ఆరాంఘర్, జేబీఎస్, KBHP కాలనీ, ఎల్‌బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.

News September 19, 2025

నిర్మల్: ‘విద్యాశాఖ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలి’

image

విద్యాశాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని ఆర్జేడీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎంఈఓలతో ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఐఎఫ్ఎస్సీ ప్యానెల్స్, టాస్ ఉల్లాస్ నమోదు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు, పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, ఏఏపీసీ పనుల నిర్వహణ, గ్రంథాలయాల నిర్వహణను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.

News September 19, 2025

పండగ సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన: హరీశ్

image

TG: దసరా స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లు <<17756948>>సవరించడంపై<<>> BRS నేత హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘పండుగలు వస్తే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో ధరలు విపరీతంగా పెంచి ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. అదనపు సర్వీసుల పేరిట 50% అదనంగా దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు బతుకమ్మ, దసరా సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన? ఇదేనా ప్రభుత్వ వైఖరి?’ అని ప్రశ్నించారు.