News April 4, 2025
లక్ష్మణచాంద మండలం నిర్మల్ జిల్లాలోనే టాప్

ఇంటి పన్ను వసూళ్లలో లక్ష్మణచాంద మండలం నిర్మల్ జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎంపీడీఓ రాధారాథోడ్ గురువారం తెలిపారు. 99 శాతం ఇంటి పన్ను వసూలు చేసినందుకు ఎంపీఓ ఆమీర్ ఖాన్, ఆయ గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆమె అభినందించారు. ఇందుకు సహకరించిన లక్ష్మణచాంద మండల ప్రజలకు, వాణిజ్య సముదాయాలకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News January 2, 2026
మెదక్: ‘విద్యావంతులే బలవుతున్నారు’

మెదక్‌లో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాలకు బలవుతున్నారని, అవగాహన లోపం, అత్యాశే కారణమని పోలీసులు తెలిపారు. APK ఫైళ్లు, అనధికారిక లోన్ యాప్‌లు, పెట్టుబడి, ఆన్‌లైన్ బెట్టింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ నేరాలకు గురైతే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
News January 2, 2026
ఇర్కోడ్ లిఫ్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలి: హరీశ్ రావు

మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించే ఇర్కోడ్ లిఫ్ట్ పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు. 2023 నాటికి 95శాతం పూర్తైన పనుల్లో కేవలం పంప్ హౌస్ మాత్రమే మిగిలిందన్నారు. ఇర్కోడ్ లిఫ్ట్ పూర్తైతే 21 గ్రామాల్లో 17,377 ఎకరాలకు సాగునీరు అంది దాదాపు 10వేల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు.
News January 2, 2026
రేషన్ కార్డు e-KYC పూర్తి చేశారా?

TG: నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల e-KYC ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇంకా చాలా మంది దీనిని పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు e-KYC చేయడం తప్పనిసరి అని తెలిపింది. కొత్త కార్డులు పొందిన వారు సైతం రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది.


