News April 4, 2025
యాదాద్రి క్షేత్రంలో చండీ హోమం

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంలకు మహాచండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News November 7, 2025
సూర్యాపేట: భార్యను చంపిన భర్త

సూర్యాపేట జిల్లా మోతె మండలం విభాళాపురంలో దారుణం జరిగింది. భర్త మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 7, 2025
కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.
News November 7, 2025
వందేమాతరం దేశభక్తిని మేల్కొలిపే శక్తి: జేసీ

వందేమాతరం నినాదం మనందరిలో దేశభక్తిని మేల్కొలిపే ఒక శక్తి అని జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు. వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఏకస్వరంతో వందేమాతర గీతాన్ని ఆలపించారు. వందేమాతరం గీతం స్వాతంత్య్ర స్ఫూర్తికి మూలం అని ఆయన తెలిపారు. ఈ గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారని గుర్తు చేశారు.


