News April 4, 2025
ఆదిలాబాద్ డీఈవోగా శ్రీనివాస్‌రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురువారం డీఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఆయనకు కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గతంలో డీఈవోగా పనిచేసిన టి.ప్రణీత పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే.
Similar News
News January 26, 2026
అక్రెడిటేషన్ జర్నలిస్టులే PRESS అని రాసుకోవాలి: ADB DPRO

అక్రెడిటేషన్ జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై PRESS అని స్టిక్కర్ అట్టించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలాబాద్ పౌరసంబంధాల శాఖ అధికారి (DPRO) విష్ణువర్ధన్ తెలిపారు. PRESS లేని వారు, ఇతర వర్గాలు ఇష్టారీతిన వాహనాలపై PRESS అని రాయవద్దని సూచించారు. ఇది మోటార్ వాహన చట్టం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
News January 24, 2026
ADB: మేడారం మహా జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మేడారం మహా జాతరకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో జాతరకు 369 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 24, 2026
ఆదిలాబాద్ జైలు సూపరింటెండెంట్ బదిలీ

ఆదిలాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. 2021లో బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగున్నరేళ్ల పాటు పారదర్శక సేవలు అందించారు. జైలు ప్రాంగణంలో పెట్రోల్ బంక్, అడ్వాన్స్‌డ్ వెహికల్ వాష్, సోలార్ పార్కింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్‌తో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదని ఆయన పేర్కొన్నారు.


