News March 26, 2024
హైకోర్టు నిర్మాణానికి రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన?

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రేపు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ భూమి చదును కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు. కాగా హార్టికల్చర్ వర్సిటీకి చెందిన 100 ఎకరాలను హైకోర్టుకు కేటాయించడంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.
Similar News
News March 10, 2026
12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.
News March 10, 2026
చమురు ధరలకు మళ్లీ రెక్కలు?

ఇప్పుడిప్పుడే తగ్గుతున్న <<19341758>>క్రూడ్<<>> ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 10%కుపైగా తగ్గిన US క్రూడ్ ఇప్పుడు కోలుకొని -4% వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధరల తగ్గుదల కూడా తటస్థంగా ఉంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. ఇరాన్‌పై ఎప్పుడూ లేని రేంజ్‌లో భీకర దాడులు చేస్తామని <<19348669>>US<<>> చెప్పడం, డ్రోన్ దాడికి UAEలోనే అతిపెద్దదైన అబుదాబి ఆయిల్ రిఫైనరీ మూతపడటం కారణాలుగా తెలుస్తోంది.
News March 10, 2026
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారులు

AP: రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల వరకు లేదా కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు వీరి పాలన సాగనుంది. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు కార్పొరేషన్లు సహా ఇతర సంస్థలకు RDO, JCలను ప్రత్యేక అధికారులుగా నియమించింది.


