News April 4, 2025
సంగారెడ్డి: శిశు గృహం చిన్నారులను సొంత పిల్లలా చూసుకోవాలి: జడ్జి

శిశు గృహలో ఉన్న చిన్నారులను కన్న పిల్లల చూసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రమేష్ సూచించారు. సంగారెడ్డిలోని శిశుగృహ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లల బాగోగులను పూర్తిగా చూసుకోవాలని చెప్పారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
వేములవాడ: పరిహారం ఇవ్వండి.. లేదా గెజిట్ నుంచి తొలగించండి..!

నష్టపరిహారం చెల్లించకుండా అపరిష్కృతంగా ఉన్న తమ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని రైల్వే లైన్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు వేములవాడలో నిరసన వ్యక్తం చేశారు. తమ భూములకు వెంటనే పరిహారం చెల్లించాలని, లేదంటే భూములు అమ్ముకునేందుకు వీలుగా గెజిట్ నుంచి తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. పరిహారం చెల్లించకుండా, గెజిట్ నుంచి తొలగించకుండా తాత్సారం చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.
News November 6, 2025
ఖమ్మం: మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు..!

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. క్షణికావేశంలో, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటీవల తిరుమలాయపాలెం(M)నికి చెందిన ఒక వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లినే గొడ్డలితో నరికి హత్య చేశాడు. సత్తుపల్లిలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యని ఓ వ్యక్తి హతమార్చాడు. ఖమ్మం(R)లో సోదరుల మధ్య పంచాయితీలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. చింతకాని(M)లో వివాహేతర సంబంధంతో ఓ భార్య భర్తను చంపింది.
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<


