News April 4, 2025
వీఎంఆర్డీఏలో 113 మందికి ప్లాట్ల కేటాయింపు

V.M.R.D.A. అధికారులు ఎంఐజి లే అవుట్లోని ప్లాట్లకు గురువారం డ్రా నిర్వహించారు. అడ్డూరు, గరివిడి, పాలవలసల్లో 113 మందికి ఈ-లాటరీలో ప్లాట్లు కేటాయించారు. అడ్డూరులో 146, గరివిడిలో 212, పాలవలసలో 472 ప్లాట్లను V.M.R.D.A. అభివృద్ధి చేసింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ల ధరలో 20 శాతం రాయితీ ఇస్తున్నారు.
Similar News
News April 11, 2025
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే: కలెక్టర్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గ్రీన్‌పార్క్ జంక్షన్ వద్ద గల శుక్రవారం ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలబాలికల పాఠశాలల ఏర్పాటు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై ఆయన చేసిన కృషి వర్ణణాతీతమని ప్రశంసించారు. అనంతరం బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి సబ్సిడీ చెక్కు అందించారు.
News April 11, 2025
విశాఖ: రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖ జిల్లాలో ఫస్టియర్ 42,257 మంది, సెకండియర్ 40,744 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 83,001 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
విశాఖ: బడుగు, బలహీనవర్గాలకు అశాజ్యోతి ఫూలే

బడుగు, బలహీనవర్గాలకు అశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అంటరానితనంపై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సామాజిక సంస్కర్త పూలే అని కొనియాడారు.