News April 4, 2025
గద్వాల జిల్లా కలెక్టర్ ముఖ్య గమనిక

LRS స్కీం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కోసం ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 30 వరకు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ.ఎం.సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ GO No 182ను జారీ చేశారని పేర్కొన్నారు.
Similar News
News April 11, 2025
నాగర్‌కర్నూల్: సళేశ్వరానికి పోటెత్తిన భక్తులు

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని సళేశ్వరం లింగమయ్య జాతరకు భక్తులు పోటెత్తారు. కాలినడకన వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. లోయలు ఉన్నందున చిన్నపిల్లలను తీసుకొచ్చే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు.
News April 11, 2025
కాకినాడ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

కాకినాడ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 56 పరీక్షా కేంద్రాల్లో 44,531 మంది పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 22,656 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 21,871 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
రేపు ‘అర్జున్ s/o వైజయంతి’ మూవీ ట్రైలర్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీ ట్రైలర్ రిలీజ్‌పై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 7.59 గం.కు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హీరో తల్లిగా విజయశాంతి నటిస్తున్నారు.