News April 4, 2025
NZB: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్‌లో ఎర్రమల పవన్ రాజు(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు నగరంలోని ఒక బట్టల షాపు వేర్ హౌస్‌లో పని చేసేవాడు. అక్కడ పని చేసే అతడి స్నేహితురాలు వ్యక్తిగత కారణాలతో మృతి చెందగా నాటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News April 15, 2025
NZB: నేడు ఉమ్మడి NZB జిల్లాకు ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం NZB జిల్లా బోధన్‌లో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్ దేశాయి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు డిచ్‌పల్లిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
News April 15, 2025
NZB: గంజాయి నిర్ములన ప్రతి ఒక్కరి బాధ్యత: సీపీ

గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సీపీ సూచించారు. సోమవారం 6వ టౌన్ PSను సీపీ సాయి చైతన్య తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. సైబర్ మోసగాళ్లు, బెట్టింగ్ యాప్‌ల నుంచి ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలన్నారు.
News April 14, 2025
NZB: దళితులను అవమానించడమే ప్రజా పాలనా?: కవిత

దళితులను అవమానించడమే ప్రజా పాలనా? అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత X లో ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. బట్టలు విప్పి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.