News April 4, 2025
అంగన్వాడీల సంక్షేమానికి కృషి: గద్వాల MLA

అంగన్వాడీ టీచర్ల సంక్షేమానికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. హాజరైన ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలకు నెలకు రూ.30 వేల వేతనం ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమాజానికి గొప్ప తరాలను అందించడంలో అంగన్వాడీల పాత్ర కీలకమని అన్నారు.
Similar News
News January 14, 2026
UPDATE: ఖమ్మం LIG ఫ్లాట్ల రహదారి సమస్య పరిష్కారం

ఖమ్మం శ్రీరాం నగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIG ఫ్లాట్లలో రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైనట్లు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రమణా రెడ్డి వెల్లడించారు. కాగా రహదారి విషయంలో ఏర్పడిన సమస్య కారణంగా, అనేక మంది దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు. సమస్య పరిష్కారం కావడంతో LIG ఫ్లాట్స్‌కు JAN 18 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, 19న లాటరీ ద్వారా ప్లాట్స్ కేటాయిస్తామని పేర్కొన్నారు.
News January 14, 2026
మిర్యాలగూడ జిల్లా డిమాండ్.. మళ్లీ తెరపైకి!

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై సీఎం ప్రకటనతో ఉమ్మడి నల్గొండలో చర్చ మొదలైంది. ప్రధానంగా మిర్యాలగూడను జిల్లాగా చేయాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో లోక్‌సభ స్థానంగా ఉన్న ఈ ప్రాంతం.. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తున్నారు. సాగర్, హుజూర్‌నగర్, దేవరకొండ ప్రాంతాలతో కలిపి జిల్లాను ఏర్పాటు చేస్తే పరిపాలన సౌలభ్యంతో పాటు ఉపాధి పెరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
News January 14, 2026
మధిర, వైరా నియోజకవర్గాలకు రూ.140 కోట్లు మంజూరు

మధిర మున్సిపాలిటీ పరిధిలో డ్రైయిన్స్, వైరా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేసిందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. రూ.40 కోట్లతో మధిర మున్సిపాలిటీలో డ్రైయిన్ నిర్మాణం, రూ.65 కోట్లతో వైరా నది వెంట వరద నివారణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మురుగునీటి కాలువల ఆధునీకరణ పనులకు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.


